రంగారెడ్డి జిల్లా మంగళపల్లి లో లాజిస్టిక్ పార్క్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

byసూర్య | Fri, Oct 11, 2019, 02:44 PM

గ్రేటర్ పరిధిలో పలు ప్రగతి పనులకు పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన్ చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువులలోకి మురుగునీరు వచ్చి చేరకుండా రూ.23 కోట్లతో హెచ్‌ఎండీఏ చేపట్టనున్న ట్రంక్ లైన్ పనులకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. మంగళ్‌పల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కును ప్రారంభించారు. రూ.22 కోట్లతో హెచ్ఎండీఏ - ఆన్‌కాన్ లాజిస్టిక్స్ పార్క్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పెద్దఅంబర్‌పేట జంక్షన్ నుంచి బాట సింగారం వరకు రూ. 1.82 కోట్లతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర స్ట్రీట్ లైట్ల ఏర్పాటు పనులను ప్రారంభించారు.


రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకునేందుకు రెండు చోట్ల లాజిస్టిక్ పార్కులకు శ్రీకారం చుట్టింది. నాగార్జునసాగర్ హైవే మంగళ్‌పల్లి వద్ద, మరోకటి విజయవాడ హైవే బాటసింగారం వద్ద కలిపి ఈ రెండు లాజిస్టిక్ పార్కు పనులకు 2017 అక్టోబరులో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో బాటసింగారంలో రూ.35 కోట్లలో 40 ఎకరాల విస్తీర్ణంలో, మంగళ్‌పల్లిలో 22 ఎకరాల్లో చేపట్టిన లాజిస్టిక్ పార్కు పనులను నిర్ణీత గడువులోగా హెచ్‌ఎండీఏ అధికారులు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే మంగళ్‌పల్లి ఫేజ్-1 లాజిస్టిక్ పార్కును తొలుత అందుబాటులోకి తీసుకువచ్చారు.


22 ఎకరాల విస్తీర్ణంలో మంగళ్‌పల్లి అన్‌కాన్ లాజిస్టిక్ హబ్ రూపుదిద్దుకున్నది. మూడు ఎకరాల విస్తీర్ణంలో లక్షా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన గోదాం (వేర్‌హౌస్)నిర్మాణాన్ని ఆధునిక సౌకర్యాలతో పూర్తి చేశారు. ఎండాకాలంలో కూడా వేడిమిని తట్టుకుని చల్లదనాన్ని ఇచ్చేలా ఇన్స్‌లేషన్‌ను ఏర్పాటు చేశారు. లక్షల టన్నుల సరుకులు ఇక్కడ నిల్వ ఉండేలా భారీ గోడౌన్ నిర్మాణం పూర్తి కావడంతో దీని సేవలు గత నెల 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. వంద మంది డ్రైవర్లు ఒకేసారి విశ్రాంతి తీసుకునేందుకు నాలుగు విశాలమైన గదులను నిర్మించారు.


డ్రైవర్లు పడుకునేందుకు బెడ్‌లను కూడా ఏర్పాటు చేశారు. డ్రైవర్ల్లకు మౌలిక వసతుల్లో భాగంగా టాయిలెట్లు, బాత్‌రూంలు నిర్మించారు. డ్రైవర్లు తమ సామానులను భద్రపరచుకోవడానికి ప్రత్యేకంగా లాకర్ల సౌకర్యాన్ని కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ట్రక్కులు, లారీల డ్రైవర్లు సేద తీరేందుకు విశ్రాంతి భవనంలో సకల సౌకర్యాలను కల్పించారు. 250 ట్రక్కులు పార్కింగ్ చేసే సామర్ధ్యం పాయింట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిలో 200 ట్రక్కులు నిలిచేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. లాజిస్టిక్ హబ్ సేవలు 30 జనవరి 2020 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నామని ఆన్‌కాన్ లాజిస్టిక్ హబ్ ఎండీ రాజశేఖర్ తెలిపారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM