కోతుల బెడద నుండి రక్షించండి : స్థానికులు

byసూర్య | Fri, Oct 11, 2019, 02:24 PM

మెదక్ పట్టణంలో మున్సిపల్ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ప్రత్యేక చొరవతో మెదక్ లో కోతుల బెడద నుండి రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మార్కెట్ వెళ్ళినా, దుకాణాలకు వెళ్ళినా చేతిలో బ్యాగ్ ఉంటే చాలు లాక్కుని పోతున్నాయని, ఇళ్లల్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రజలు తెలిపారు. కూరగాయల సంచుల మీద పడి లాక్కుపోతున్నాయని, కోతుల మధ్య గొడవ చూస్తే ఒక భయంకరమైన పోరు కనబడుతుందని, చిన్న పిల్లలు దుకాణాలకు కూడా వెళ్లడానికి భయపడుతున్నారని ప్రజలు తెలిపారు. దయచేసి కోతులు పట్టేవారిని పిలిచి, మెదక్ పట్టణంలో కోతులను పట్టించి, అటవీ ప్రాంతంలో వదిలి వేయాలని అధికారులను వేడుకుంటున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM