ఇక ప్లాస్టిక్ ర‌హిత తెలంగాణ - కేసీఆర్ స‌రికొత్త నిర్ణ‌యం

byసూర్య | Fri, Oct 11, 2019, 12:48 AM

 తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ పై నిషేధం విధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారులను ఆదేశించారు.  గురువారం నాడు హైదరాబాద్ లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కెసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక గ్రామాల్లో విజయవంతమైందని,. పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందంటూ   డీపీవోలు, డీఎల్ పీవోలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు  కేసీఆర్ అభినందనలు తెలిపారు.


పల్లె ప్రగతి కార్యక్రమంతో మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చింది. భవిష్యత్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు చెప్పారు. ఇక ప్లాస్టిక్ ర‌హిత తెలంగాణ ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ రూపొందిస్తుంద‌ని, త్వరలో మంత్రివర్గంలో దీనిపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.


 


Latest News
 

రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM
ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM
ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్ నిర్మాణ పనులు Tue, Apr 23, 2024, 12:35 PM