30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై సిఎం కేసిఆర్ స‌మీక్ష‌

byసూర్య | Thu, Oct 10, 2019, 07:53 PM

గురువారం ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రాణికోటికి, పర్యావరణానికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. దీనికి అవసరమైన విధివిధానాలు ఖరారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం నిర్వహణలో కేంద్రం నుంచి అవార్డులు అందుకున్న పలువురు జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి అభినందించారు. ఇదే సమయంలో ప్రతి కలెక్టర్‌కు రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, మొక్కల పెంపకానికి నిధులు ఉపయోగించాలని సీఎం సూచించారు. గ్రామాలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ నిధుల కొరత రానివ్వమని, 1.063 ఎకరాల్లో మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఎస్టీ ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంట్ కోసం త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM