గిరిజన విద్యార్థులకు అండగా ఎన్ఆర్ఐలు

byసూర్య | Thu, Oct 10, 2019, 07:12 PM

గిరిజన విద్యార్థులకు అండగా ఉంటామని  ఎన్ఆర్ఐలు కూడా ముందుకు వచ్చారు. రాష్ట్ర గిరిజన, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపుకు స్పందించిన స్థానికులతో పాటు నోకియా కార్పొరేషన్ ఆసియా సంస్థ హెడ్ జి.వి సత్యనారాయణ నాయక్, ఆయన భార్య శకుంతల మంత్రి సత్యవతి రాథోడ్ ను గురువారం కలిసి విద్యార్థల కోసం 100 బ్లాంకెట్లను అందించారు. కాగా.. గిరిజన విద్యార్థుల, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద తమ సంస్థ సహాయం చేస్తుందని వారు తెలిపారు. గిరిజన విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన కార్పొరేట్ ప్రతినిధులకు మంత్రి సత్యవతి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన ప్రజలకు, విద్యార్థులకి సాహాయం చేయడానికి మరిన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.


 


Latest News
 

జైలు అధికారులు వసతులు కల్పించడం లేదు: ఎమ్మెల్సీ కవిత Fri, Mar 29, 2024, 09:55 AM
కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 09:42 AM
కేంద్రీయ విద్యాలయల్లో ప్రవేశాలకు షెడ్యూల్ Fri, Mar 29, 2024, 09:25 AM
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు Fri, Mar 29, 2024, 09:09 AM
పెరిగిన ఎండలు... వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ Fri, Mar 29, 2024, 09:07 AM