మాదాపూర్ లో భారీ వర్షం

byసూర్య | Thu, Oct 10, 2019, 03:13 PM

హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఓ మోస్తర్ నుంచీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఆల్రెడీ ఇప్పటికే సిటీలో మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణమైనా అవి కుండపోత వర్షం కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఉన్నట్టుండి వానలు కురుస్తున్నాయి. ఒకేసారి భారీ వర్షం పడి... అప్పటికప్పుడు రోడ్లు, కాలనీలన్నీ కాలువల్లా మారిపోతున్నాయి. రెండ్రోజులుగా కాస్త వర్ష బీభత్సం తగ్గినా... మళ్లీ భారీ వర్ష సూచన ఉందని అధికారులు ఇప్పుడు చెప్పారు. నైరుతీ రుతుపవనాలు వెళ్లిపోయినా... ఉపరితల ఆవర్తనం వల్ల దట్టమేన మేఘాలు ఏ క్షణమైనా కురిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇళ్లకు వెళ్లాల్సిన వారు వీలైనంత త్వరగా చేరుకోవాలని కోరుతున్నారు అలాగే మ్యాన్ హోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలనీ, నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మ్యాన్ హోళ్లు కనిపించవు కాబట్టి.. అలాంటి చోట్లకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. భారీ వర్షం కురిస్తే... రాలిపోయే చెట్లు, నిలిచిపోయే నీటిని వీలైనంత త్వరగా తొలగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM