ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈనెల 15కు వాయిదా

byసూర్య | Thu, Oct 10, 2019, 02:06 PM

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. తాను కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి 10 రోజుల గడువు కావాలని ఆర్టీసీ గుర్తింపు సంఘాలు, జేఏసీ ధర్మసనాన్ని కోరాయి. సమస్య పరిష్కారానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 15వ తేదీనికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ హైకోర్టుకు తెలిపింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈనెల 15లోగా పూర్తి వివరాలతో ఆర్టీసీ కార్మికులు కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బస్‌పాస్‌లు చెల్లుబాటు అయ్యేలా, అధిక ఛార్జీలు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలిపింది.


Latest News
 

అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM
నేడు మక్తల్ లో డీకే అరుణ ప్రచారం Thu, Apr 25, 2024, 12:55 PM
నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ Thu, Apr 25, 2024, 12:47 PM
ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM