చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో సింధు

byసూర్య | Sun, Aug 25, 2019, 02:20 PM

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించేందుకు భారత ఏస్ షట్లర్, తెలుగుతేజం సింధు కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నీలో సింధూ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకుంది.  సింధు గనుక ఈ రోజు జరిగే ఫైనల్ లో ఒకహురాపై విజయం సాధించి టైటిట్ కైవసం చేసుకుంటే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. ప్రస్తుతం సింధు పాం చూస్తుంటే జపాన్ క్రీడాకారిణి ఒకు హరాను నిలువరించి టైటిల్ సాధించడం ఖాయమనిపించక మానదు.  వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరి సత్తా చాటిన సింధు ఫైనల్ లో ఒకహురాపై విజయం సాధించి 2017 ఫైనల్ లో తనకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. 2017లో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ పోటీలో ఒకహురాతో తలపడిన సింధు…కొదమ సింహంలా పోరాడింది. మొత్తం మూడు గేములూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగాయి. ఇరువురి మధ్యా జరిగిన ఈ ఫైనల్ అందరినీ ముని కాళ్లపై నిలబెట్టింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన నాటి ఫైనల్ లో సింధు తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. అయితేనేం ప్రపంచ వ్యాప్తంగా  అందరి మనసులనూ గెలుచుకుంది. ఇప్పుడు అందరి దృష్టీ ఈ రోజు జరగనున్న ఫైనల్ పైనే ఉంది.  ఇరువురి మధ్యా మరో హోరాహోరీ పోరు తప్పదు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM