గ్రామానికి ఒక్క వినాయకుడు చాలు : హరీష్ పిలుపు

byసూర్య | Wed, Aug 21, 2019, 11:51 PM

 సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈసారి వినాయక నవరాత్రి ఉత్సవాలకు ప్రతి  గ్రామం మొత్తానికి ఒకటే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. అదీ మట్టివినాయకుడినే పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ   కులాలు సంఘాలు కాలనీల వారీగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో ప్రమాదకర రసాయనాలు కలిపిన రంగులు వాడడం వల్ల నిమజ్జనం తర్వాత చెరువులు కలుషితమై చేపలు చనిపోయి.. ఆ సాగునీటితో పంటలు ఎండిపోయి దిగుబడి తగ్గుతోంది. పైగా వినాయక ఉత్సవాల మైక్ లతో ఊరు వాడ శబ్ధ కాలుష్యం.. ఇక కొన్నిచోట్ల యువకుల మధ్య ఆధిపత్య పోరుతో ఘర్షణలు.. ఇలా అన్నింటిని బేరీజు వేసుకొని ఇలా ఊరుకొక్కటి వినాయక విగ్రహం పెడితే బాగుంటుందని సూచించారు . దీనికి  ‘ఏక వినాయక మహోత్సవం’గా పేరుపెట్టారు. ఇప్పటికే తొట్టతొలిగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఒకటే వినాయకుడి మట్టి విగ్రహం ఊరంతటికి పెట్టాలని తీర్మానించగా.  మండలంలోని  అన్ని గ్రామాలు ఇదే బాటలో నడుస్తున్నాయట..


సో హరీష్ రావు లక్ష్యం నెరవేరే సూచనలే కనిపిస్తున్నాయి.. ఇది తెలంగాణ వ్యాప్తంగా కొనసాగితే మాత్రం ప్రకృతిని మనమంతా కాపాడినవారమ వుతామనిపించడం లేదూ ?




 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM