కమీషన్ల కోసమే మిషన్‌ భగీరథ : జీవన్‌రెడ్డి

byసూర్య | Wed, Aug 21, 2019, 02:34 PM

మిషన్‌ భగీరథ పుట్టిందే కమీషన్ల కోసం అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు రూ.100 కోట్లకు మించితే గ్లోబల్‌ టెండర్లు పిలవాలి, రూ.4వేల కోట్ల పనులు నామినేషన్‌ ద్వారా ఇచ్చి అవినీతిని ప్రోత్సహించారన్నారు. బీజేపీ ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ అవినీతి గురించి మాట్లాడటం సంతోషమన్నారు. పాలన గాడితప్పిందని కలెక్టర్ల సదస్సులో స్వయంగా సీఎం ఒప్పుకున్నారన్నారు. అవినీతిని తగ్గించేందుకు కొత్త రెవెన్యూ చట్టం అంటున్నారని, అంటే ఇప్పటి వరకు అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లే కదా? అని ప్రశ్నించారు. అవినీతి బయటపడుతుందనే కాళేశ్వరం డీపీఆర్‌ను కేంద్రానికి పంపలేదని విమర్శించారు. కేంద్రానికి డీపీఆర్‌ పంపి ఉంటే రూ.60వేల కోట్ల సహాయం రాష్ట్రానికి అందేదన్నారు.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM