హైదరాబాద్‌లో అమెజాన్‌ క్యాంపస్ ప్రారంభం

byసూర్య | Wed, Aug 21, 2019, 01:22 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అమెజాన్‌ క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అమెజాన్‌ క్యాంపస్ ను రాష్ట్ర హోంమంత్రి మహముద్‌ అలీ ప్రారంభించారు. అనంతరం అక్కడ మహముద్‌ అలీ మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో అమెజాన్‌ ఇండియా సీనియర్‌ ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌, సంస్థ స్థిరాస్తి, వసతుల మేనేజర్‌ జాన్‌ స్కోట్లర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు. నానక్‌రామ్‌గూడలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్యాంపస్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. 2016, మార్చి 31న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌.. అమెజాన్‌ సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 15 అంతస్తులుగా 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 7 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఉద్యోగుల సంఖ్య పది వేలకు చేరుకోనుంది. హైదరాబాద్‌ క్యాంపస్‌ నుంచి అమెజాన్‌ అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించనుంది. 


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM