హైదరాబాద్‌లో మెట్రో ప్రతి 4 నిమిషాలకు

byసూర్య | Tue, Aug 20, 2019, 05:41 PM


హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నిమిషాల్లో సరైన సమయానికి గమ్యాన్ని చేరుస్తుండడంతో నగర వాసులు ముఖ్యంగా ఉద్యోగులు మెట్రో వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక హైదరాబాద్‌ మెట్రో ప్రస్తుతం ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌, నాగోల్ నుంచి హైటెక్ సిటీకి ఇలా రెండు కారిడార్ లలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మరీ ముఖ్యంగా అమీర్ పేట నుంచీ హైటెక్ సిటీకి రోజూ వేలాదిమంది ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. కాగా ఇప్పటి వరకు జూబ్లీ చెక్‌పోస్టు నుంచి హైటెక్‌ సిటీ వరకు సింగిల్‌ లైన్‌ ద్వారా రైళ్లు నడవగా..ఇప్పుడు ఈ రూట్ లో మెట్రో అధికారులు రివర్సల్‌ సిస్టమ్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోఇక నుంచి అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడవనుంది. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ కారిడార్‌లో ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి రానుంది.హైటెక్‌ సిటీ - అమీర్‌పేట కారిడార్‌లో 2, 3 వారాల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒక రైలు నడవనుంది. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా ప్రతి 3 నిమిషాలకు కూడా ఒక రైలు నడపనున్నారు. 



 



Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM