అమీర్‌పేట టూ హైటెక్‌సిటీ

byసూర్య | Tue, Aug 20, 2019, 03:30 PM

 హైటెక్‌ సిటీ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు రివర్సల్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చింది. గతంలో జూబ్లీ చెక్‌పోస్టు నుంచి హైటెక్‌ సిటీ వరకు సింగిల్‌ లైన్‌ ద్వారా రైళ్లు నడిపింది మెట్రో. రివర్సల్‌ సిస్టమ్‌ అందుబాటులోకి రావడంతో ఇక నుంచి అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడవనుంది. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ కారిడార్‌లో ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి రానుంది. హైటెక్‌ సిటీ - అమీర్‌పేట కారిడార్‌లో 2, 3 వారాల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒక రైలు నడవనుంది. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు నడపనున్నారు. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఏసీ ఉష్ణోగ్రతను 23 డిగ్రీలకు తగ్గించారు.


Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM