డెబిట్ కార్డులు ఎత్తివేయ‌నున్న ఎస్‌బీఐ

byసూర్య | Tue, Aug 20, 2019, 12:08 PM

హైద‌రాబాద్‌: బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ నుంచి డెబిట్ కార్డుల‌ను ఎత్తివేయ‌నున్నారు. డిజిట‌ల్ పేమెంట్స్‌ను ప్రోత్స‌హించే నేప‌థ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్(ఎస్‌బీఐ) కార్డుల‌ను పూర్తిగా ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐలో ఎక్కువ శాతం క‌స్ట‌మ‌ర్లు డెబిట్ కార్డుల‌ను వినియోగిస్తున్నారు. తాము డెబిట్ కార్డుల‌ను సంపూర్ణంగా తొల‌గించాల‌ని భావిస్తున్న‌ట్లు ఆ బ్యాంక్ చైర్మ‌న్ ర‌జ‌నీశ్ కుమార్ తెలిపారు. దేశంలో 90 కోట్ల డెబిట్ కార్డులున్నాయి. మ‌రో 3 కోట్ల క్రెడిట్ కార్డుల‌న్నాయ‌న్నారు. యోనో యాప్‌తో డెబిట్ కార్డుల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని ఎస్‌బీఐ భావిస్తున్న‌ది. యోనో ప్లాట్‌ఫామ్‌తో ఆటోమేటెడ్ టెల్ల‌ర్ మెషీన్ల వ‌ద్ద క్యాష్‌ను డ్రా చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించ‌నున్నారు. ఏదైనా షాపు వ‌ద్ద కొనుగోలు చేయాలంటే కూడా యోనో ప్లాట్‌ఫామ్‌ను వాడే వీలు క‌ల్పిస్తారు. దేశ‌వ్యాప్తంగా 68వేల యోనో క్యాష్ పాయింట్లు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM