సైనికుడి భార్యతో అఫైర్..

byసూర్య | Mon, Aug 19, 2019, 04:19 PM

స్నేహితుడే కదా అని నమ్మించి ఇంటికి రానిచ్చిన పాపానికి అతడి భార్యతోనే అఫైర్ పెట్టుకున్నాడో వ్యక్తి. సైనికుడైన స్నేహితుడు దేశ సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉంటే ఇక్కడ అతడి భార్యతో రాసలీలలు కొనసాగిస్తూ స్నేహ బంధానికే మచ్చ తెచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో జరిగింది.కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపంలోని కాప్పికాడు ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్ బైకులను విక్రయిస్తుంటాడు. కొంతకాలం క్రితం పంచమూర్తి ప్రాంతానికి చెందిన ఓ సైనికుడు రమేష్ వద్ద బైకు కొన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి పరిచయం స్నేహంగా మారింది. దీంతో రమేష్ అప్పుడప్పుడూ సైనికుడు ఇంటికి వెళ్తుండటంతో అతడి భార్యతో చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. 


సైనికుడు ఇంట్లో లేని సమయంలో వారిద్దరు రాసలీలలు సాగించేవారు. ఈ క్రమంలోనే ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో రమేష్ సెల్‌ఫోన్లో ఫోటోలు తీశాడు. ఇటీవల రమేష్ ఫోన్‌ను ఆయన భార్య ఓపెన్ చేయగా ఆ ఫోటోలు కనిపించాడు. దీంతో భర్త తనను మోసం చేస్తున్నాడని భావించి ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో పెట్టేసింది. ఈ విషయం సైనికుడికి తెలియడంతో రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీులు కేసు నమోదు చేసుకుని రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై బాధితురాలు ఎలాంటి ఫిర్యాదు చేయనట్లుగా తెలుస్తోంది. 


Latest News
 

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు నామినేషన్.. అధిష్టానం ప్రకటించకుండానే Tue, Apr 23, 2024, 07:44 PM
కవితకు బిగ్ షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు.. అప్పటిదాకా జైలులోనే Tue, Apr 23, 2024, 07:39 PM
కల్పన అనేది అబద్ధంలో దాగున్న నిజం.. ఆలోచింపజేస్తున్న స్మితా సబర్వాల్ ట్వీట్ Tue, Apr 23, 2024, 07:31 PM
పెళ్లి తర్వాత మళ్లీ బరిలో దిగిన బర్రెలక్క.. ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పోటీగా Tue, Apr 23, 2024, 07:27 PM
ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన నిర్ణయం Tue, Apr 23, 2024, 07:23 PM