హైదరాబాద్ హబ్.. కొలువుల జాతర..

byసూర్య | Mon, Aug 19, 2019, 04:09 PM

హైదరాబాద్.. ఐటీ జాబ్స్ గా మారుతోంది. ప్రపంచంలోనే టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సోషల్ మీడియా సంచలనం ఫేస్ బుక్ ఇక అమెరికాకు చెందిన దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ యాపిల్.. క్వాల్ కామ్.. ఇలా ఎన్నో ఎన్నెన్నో హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేసి వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.. ఉపాధినిస్తున్నాయి. ఉపాధికి ఊతం ఇస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరింది.


 ప్రప్రంచ ప్రఖ్యాత నంబర్ 1 ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో పూర్తి చేసింది. దాదాపు 9వేల మందికి ఉద్యోగులు ఇచ్చింది. ఇప్పుడు ఇందులో పనిచేస్తున్నారు. నానక్ రాంగూడలోని 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. ఈనెల 21న సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. ఒకేసారి 26వేల నుంచి 30వేల మంది వరకు ఇందులో పనిచేసేలా మౌళిక వసతులున్నాయి.


అమేజాన్ కంపెనీ హైదరాబాద్ కు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే దేశంలోఅతిపెద్ద గోదాంను శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో నిర్మించి ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ను నిర్మించింది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో వేలమందికి ఉద్యోగాలు దక్కుతున్నాయి. ప్రపంచప్రఖ్యాత కంపెనీలన్నీ హైదరాబాద్ కు తరలివస్తుండడం ఉపాధి కల్పిస్తుండడం ఇక్కడి నిరుద్యోగులకు వరంగా మారనుంది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM