ఆరోగ్యశ్రీ నిలిపివేతతో ప్రజల ఇక్కట్లు...

byసూర్య | Mon, Aug 19, 2019, 12:02 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నాలుగో రోజూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా డయాలసిస్‌ నుంచి గుండెకు స్టంట్‌ వరకు వివిధ సమస్యలకు వేలాది మంది రోగులు ఖరీదైన సేవలను ఉచితంగా పొందుతున్నారు. అయితే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడంలేదంటూ గురువారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేశారు.గుండె, కిడ్నీ రోగులకు అత్యవసరంగా పేర్కొనే రక్తమార్పిడి ప్రక్రియను సైతం అందించడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. డిమాండ్‌లు పరిష్కరిస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు స్పష్టం చేశాయి.సేవల నిలిపివేతతో సుదూర ప్రాంతాలు, మారుమూల జిల్లాల నుంచి నిమ్స్‌, గాంధీ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.


Latest News
 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ నేత సిరిపెల్లి దంపతుల మృతి.. చిన్నతనంలోనే పీపుల్స్ వార్‌లోకి Fri, Apr 19, 2024, 07:29 PM
హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్... రేపు కాంగ్రెస్‌ గూటికి ఇంకో ఎమ్మెల్యే Fri, Apr 19, 2024, 07:26 PM
కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం.. మంత్రి పొన్నం ప్రభాకర్ Fri, Apr 19, 2024, 07:22 PM
అమ్మతనం కోసం ఆరాటం.. ఆ చిలుకూరి బాలాజీయే ఉక్కిరిబిక్కిరి Fri, Apr 19, 2024, 07:18 PM