నాంపల్లిలో బీజేపీ నవ తెలంగాణ బహిరంగ సభకు నడ్డా

byసూర్య | Sun, Aug 18, 2019, 08:45 PM

నాంపల్లిలో ఆదివారం బీజేపీ నవ తెలంగాణ బహిరంగ సభకు  బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హాజర య్యారు. రజాకార్లపై పోరాడిన భూమి తెలంగాణ అని  నడ్డా కొనియాడారు. నిజాంపై తెలంగాణ ప్రజలు అలుపెరగని పోరాటం చేశారని చెప్పారు. రజాకార్లపై పోరాడిన వీరులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉంద న్నారు. ఆర్టికల్ 370 రద్దుని దేశమంతా స్వాగతించిందని చెప్పారు.ట్రిపుల్ తలాఖ్ విధానానికి స్వస్థి పలికి ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమ న్నారు. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండకూడ దన్నారు. ఒకే దేశం..ఒకే రాజ్యాంగం విధానాన్ని ప్రధాని మోడీ అమలు చేశారని తెలిపారు. మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మి బీజేపీలో చేరినవారికి కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేశామని వెల్లడించారు.
కాంగ్రెస్ కు రాజకీయ ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ దేశం మీద లేదని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణ వచ్చాక దళితుడిని సీఎంని చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయగా మారిందని విమర్శించారు. డిసెంబర్ లోపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ఉంటుందన్నారు. బీజేపీలో అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందన్నారు. కార్యకర్తలు కూడా పార్టీ అధ్యక్షులయ్యే అవకాశమున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. బీజేపీకి అందరి ఆశీర్వాదం కావాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. 

Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM