అన్నివేళల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కావాలి : కేసీఆర్

byసూర్య | Sun, Aug 18, 2019, 05:40 PM

జెన్ కో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్ శర్మను తెలంగాణ సీఎం కేసీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని రంగాలకూ అన్నివేళల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కావాలని, దేశంలో ఇంకా విద్యుత్ కోతలు అమలవుతున్నాయని, ఈ పరిస్థితి మారాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉందని, రాష్ట్ర ప్రగతికి ఆనాడు విద్యుత్ సమస్యే తీవ్ర అవరోధంగా నిలిచిందని అన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించనిదే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదని భావించామని, విద్యుత్ రంగాన్ని తీర్చి దిద్దడానికి సమగ్ర వ్యూహం అనుసరించామని, కేవలం, ఆరు నెలల్లో విద్యుత్ కోతలు ఎత్తి వేశామని అన్నారు. ఇప్పుడు అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.


Latest News
 

కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM