టీ-పీసీసీ అధ్యక్షుడి మార్పు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కుంతియా

byసూర్య | Mon, Jun 24, 2019, 06:34 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా పేర్కొన్నారు. హైద్రాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏఐసీసీ నిర్ణయం తీసుకునే వరకూ ఆ పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు. క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. గెలిచిన తర్వాత ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని, ఏదైనా చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పాలని, పార్టీ నుండి వెళ్లిపోతే పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కొనసాగాలని ఆయన కోరారు. రాహుల్ మంచి ఫైటర్ అన్న విషయం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఈ ఎన్నికల వ్యూహరచనకు సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఓ కమిటీ వేస్తామని, జులై మొదటి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు.


Latest News
 

తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM
ఆ మార్గంలో జర్నీ చేసేవారికి టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్ Thu, Apr 25, 2024, 07:50 PM
భర్తకు గుడి కట్టిన భార్య.. పతిపై ఎంత ప్రేమ Thu, Apr 25, 2024, 07:44 PM
నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు Thu, Apr 25, 2024, 07:38 PM