వర్షాల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ సమీక్ష

byసూర్య | Mon, Jun 24, 2019, 02:01 PM

హైదరాబాద్ : జోనల్, డిప్యూటీ కమిషనర్లతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాల దృష్ట్యా వెంటనే చేపట్టాల్సిన పనులపై కమిషనర్ సమీక్షించారు. నీటి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలి అని సూచించారు. వర్షాల సమయంలో ఐఆర్టీ, విపత్తు బృందాలతో కలిసి పని చేయాలని అధికారులను ఆదేశించారు. 120 వాటర్ లాకింగ్ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలకు స్థలాలు గుర్తించాలని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో అర కిలోమీటర్ వరకు వ్యర్థౠలు లేకుండా చూడాలన్నారు. ముంపునకు గురయ్యే 120 ప్రాంతాలకు ఏ, బీ, సీ కేటగిరీలుగా గుర్తించాలని సూచించారు. ఏ కేటగిరీ ప్రాంతంలో శాశ్వతంగా మోటార్ పంపులు ఏర్పాటు చేయాలన్నారు. విపత్తు నిర్వహణ బృందాలను 8 నుంచి 15 వరకు పెంచుతున్నామని కమిషనర్ తెలిపారు. నగరంలోని 495 మాన్‌సూన్ బృందాల వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేశామని కమిషనర్ దాన కిశోర్ వెల్లడించారు. 


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM