జూలై 20న ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా!

byసూర్య | Sun, Jun 23, 2019, 08:52 PM

ఉద్యోగులు..ఉపాధ్యాయులు..పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా జరుగనుంది. ఇందుకు ఎస్టీయూటీఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆ సంఘం భావిస్తోంది. మధ్యంతర భృతి, పీఆర్సీతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరిసిస్తూ మహాధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూటీఎస్) అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు. 
జూలై 20న ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా జరుగుతుందన్నారు. మధ్యంతర భృతిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని..పీఆర్సీ ఇవ్వకుండా జాప్యం చేస్తోందని తెలిపారు. పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు, ఎన్నికల హామీల అమలు కోసం ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. 


 


Latest News
 

కాశీ పాదయాత్రకుడికి ఘన స్వాగతం పలికిన భక్తులు Sat, Apr 20, 2024, 12:52 PM
సంక్షేమ పథకాలే బిజెపిని గెలిపిస్తాయి Sat, Apr 20, 2024, 12:50 PM
గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు Sat, Apr 20, 2024, 12:34 PM
ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని ప్రచారం Sat, Apr 20, 2024, 12:32 PM
విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి: సంక్షేమఅధికారి బావయ్య Sat, Apr 20, 2024, 12:30 PM