సమ్మె విరమించిన జూడాలు!

byసూర్య | Sat, Jun 22, 2019, 09:18 PM

జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. జూనియర్‌ డాక్టర్లతో సమావేశమైన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. తమ డిమాండ్స్‌కు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపును నిరసిస్తూ జూడాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అలాగే, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేయాలని, కాంట్రాక్టు వైద్యుల నియామకాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వారు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. తమ డిమాండ్లకు సానుకూలంగా మంత్రి స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు విజేందర్ తెలిపారు.


 


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM