హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా రాఘవేంద్రసింగ్‌ ప్రమాణస్వీకారం

byసూర్య | Sat, Jun 22, 2019, 12:02 PM

తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌తో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు.


కాగా హైకోర్టు సీజేగా ఉన్న టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ కోల్‌కతా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ కావడంతో మార్చి 27వ తేదీను జస్టిస్ రాఘవేంద్ర తాత్కాలిక సీజేగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం మే 10న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయనకు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విష‌యం విదిత‌మే.  ఆ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం, కేంద్ర న్యాయశాఖ  ఉత్తర్వులు జారీచేయ‌టం చ‌క‌చ‌కా జ‌రిగి పోయాయి.  


1959, డిసెంబరు 24న జన్మించిన రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అమెరికాలోని ఆర్కేడియా యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1980లో న్యాయవాద విద్య పూర్తిచేసి 1986-2005 మధ్య రాజస్థాన్ హైకోర్టులో న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేశారు. 2005లో రాజస్థాన్ హైకోర్టు జడ్జిగా నియమితులై అదే ఏడాది కర్ణాటక హైకోర్టుకు బ‌దిలీ అయ్యారు. 2018, నవంబరులో హైదరాబాద్ హైకోర్టులకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ, ఏపీకి హైకోర్టు విభజన జరగడంతో ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగారు. 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM