కాళేశ్వ‌రం ఆరంభానికి హ‌రీష్ వెళ్తారా?

byసూర్య | Thu, Jun 20, 2019, 05:16 PM

తెలంగాణ రాష్ట్రం ఏర‌ప్ప‌డ్డాక అనేక ప్రాజ‌క్టుల‌కు రీ డిజైనింగ్ చేయించి నీళ్లు పారించాలన్న‌ది కేసీఆర్ క‌ల అందుకు త‌గ్గ‌ట్టే  కాళేశ్వరం ప్రాజెక్టు ప్లాన్ కూడా కేసీఆర్ ద‌గ్గ‌రుండి మ‌రీ చేయించుకున్నారు. అయితే  ఇంత‌టి భారీ ప్రాజ‌క్టు ప్రాజ‌క్టు  రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తి అయ్యిందంటే అదంతా హరీశ్ కష్టం.. స్వేదమన్న విషయం బహిరంగ రహస్యం. ప్ర‌తిక్ష‌ణం ఈ ప్రాజ‌క్టు ప‌నుల‌పైనే దృష్టి కేటాయించి ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించింది హ‌రీష్ రావుకు తీరా ప్రాజ‌క్టు ఆరంభంలోనూ క‌నీస గౌర‌వం ద‌క్కేనా? అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. 


ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్ కు రెండోసారి అధికారంలోకి వచ్చినంతనే ఆ పదవిని ఇవ్వని సిఎం కేసీఆర్.. ఆ శాఖను తన దగ్గరే ఉంచుకుని ఎప్ప‌టిక‌ప్పుడు ప్రాజ‌క్టు ప‌నులు స‌మీక్షించారు. అప్ప‌టికే 90 శాతం పైగా ప‌నులు పూర్తి కావ‌టంతో అధికారులు మిగిలిన ఐదు శాతం ప‌నులు పూర్తి చేయ‌టం న‌ల్లేరుమీద న‌డ‌క‌లానే సాగింది.  తాజాగా కాళేశ్వరం ప్రాజ‌క్టు ప్రారంభోత్స‌వ ఆహ్వానాల‌ను దేశ వ్యాప్తంగా అంద‌రికీ పంచుతూ మీద అదే పనిగా మాట్లాడుతున్న కేసీఆర్..  ఏ సందర్భంలోనూ క‌నీసం హరీశ్ ప్రస్తావన తీసుకురాక పోవ‌టం  హరీశ్ వర్గం కు మింగుడు ప‌డ‌టం లేదు.  తాము ఈ ప‌రిస్థితిపై అధినేతను ప్రశ్నించలేని  స‌మ‌యంలో కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి హరీశ్ ప్రస్తావన తేవటమేకాదు.. ప్రాజెక్టు ఓపెనింగ్‌కు  ఆయన్ను ఆహ్వానించండంటూ విన్న వించ‌డంతో   పెట్టేసిన హరీశ్ గురించి.. ఆయన  కష్టం గురించి మీడియాలో ప్ర‌స్తావిస్తూ,  గులాబీ బ్యాచ్   ఉలిక్కిపడేలా  చేసారు. మ‌రి హ‌రీష్‌ని ఆహ్వానిస్తారా? ఆయ‌నే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంగా వెళ‌తారా? అన్న చ‌ర్చ ఇప్పుడు టిఆర్ ఎస్ వ‌ర్గాల‌లో వినిపిస్తోంది.


 


 


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM