తెలంగాణకు గోదావరి నీళ్లు రాకుండా అడ్డుకున్నది కేసీఆరే: భట్టి

byసూర్య | Thu, Jun 20, 2019, 01:33 PM

15 శాతం నిర్మాణం కూడా పూర్తి కాని కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 15 శాతం నిర్మాణానికే రూ. 50 వేల కోట్లు ఖర్చయితే... పూర్తి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు కావాలని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామని చెప్పారు. ఉమ్మడి ఏపీలో 70 శాతం పూర్తైన ప్రాజెక్టులకు అడ్డుపడి... తెలంగాణకు గోదావరి నీళ్లు రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ చేసిందేమీ లేదని... ఎలాంటి త్యాగం చేయని ఆయనను కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించారని అడిగారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM