వాయుసేన విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు లభ్యం

byసూర్య | Thu, Jun 20, 2019, 01:02 PM

ఈ నెల 11వ తేదీన అసోంలోని వాయుసేన ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకుని, నిమిషాల వ్యవధిలోనే కూలిపోయిన ఏఎన్ -32 విమానంలో ప్రయాణించిన వారిలో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగతా ఏడుగురి శరీర భాగాలు లభ్యమయ్యాయని తెలిపారు. సముద్ర మట్టానికి దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో వీరి శరీర భాగాలు చెల్లాచెదరుగా పడివున్నాయని అధికారులు తెలిపారు. రష్యాలో తయారైన ఈ టర్బోప్రాప్ ట్రాన్స్ పోర్ట్ విమానం, అసోంలోని జోర్హాట్ నుంచి మేచుకాకు బయలుదేరి కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆపై రెండు రోజుల తరువాత విమానంలోని అందరూ మరణించారని అధికారిక ప్రకటన వెలువడింది. జోర్హాట్ లోని ఎయిర్ బేస్ కు మృతదేహాలు, శరీర భాగాలను చేర్చామని, వాటిని బంధువులకు అప్పగించనున్నామని ఓ అధికారి తెలిపారు. విమానంలోని సీవీఆర్ (కాక్ పీట్ వాయిస్ రికార్డర్), బ్లాక్ బాక్స్ లను గతవారంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల్లో విమానం కూలిన కారణంగానే, విమానాన్ని గుర్తించడంలోనూ, మృతదేహాలను వెలికి తేవడంలోనూ ఆలస్యం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.


Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM