తెలంగాణ కేబినెట్‌ సమావేశం ప్రారంభం

byసూర్య | Tue, Jun 18, 2019, 02:31 PM

హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. పలు కీలక నిర్ణయాలపై మంత్రివర్గంలో చర్చ జరుగుతోంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలపై మంత్రివర్గం చర్చించనుంది. లక్షలోపు రుణమాఫీ అమలుకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. ఆసరా పింఛన్ల పెంపు ఉత్తర్వులను మంత్రిమండలి ఆమోదించనుంది. అలాగే కొత్త సచివాలయం, అసెంబ్లి నిర్మాణంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత సచివాలయం ఉన్న చోటనే కొత్తది నిర్మించే ప్రతిపాదన ఉంది. కొత్త అసెంబ్లిని రోడ్లు భవనాల కార్యాలయం వద్ద నిర్మించాలని యోచనలో ఉన్నారు. వీటిపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM