రవిప్రకాష్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

byసూర్య | Tue, Jun 18, 2019, 02:19 PM

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ(జూన్-18,2019)వాదనలు ముగిశాయి.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది.ఇవాళ కోర్టులో రవిప్రకాష్ తరపున వాదనలు వినిపించిన దిల్ జిత్ సింగ్ అహువాల్యా...టీవీ 9షేర్ ల అగ్రిమెంట్ కుట్రపూర్వకంగా జరిగిందన్నారు.షేర్లు కొనుగోలు చేసినప్పుడు మనీ ట్రాన్సక్షన్ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు.కాపీ రైట్స్ ప్రకారం టీవీ 9 లోగో రవిప్రకాష్ కే చెందుతుందన్నారు.రవిప్రకాష్ 40వేల షేర్లను నటుడు శివాజీకి అమ్మడం వాస్తవమని తెలిపారు.ఈ షేర్ల కొనుగోలు మొత్తం బ్యాంక్ ల ద్వారా లావాదేవీలు జరిగాయన్నారు.నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లోకేసు పెండింగ్ లో ఉందన్నారు.


రవిప్రకాష్ పై మూడు కేసులు వెంట వెంటనే నమోదయ్యాయన్నారు. అయితే టీవీ 9 షేర్ల కొనుగోలు నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకి తెలియజేశారు.దీనికి సంబంధించి అగ్రిమెంట్  పేపర్లను కోర్టుకి సమర్పించారు.బ్యాంకుల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ జరిగిందన్నారు.దీనికి సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకి సమర్పించారు. టీవీ 9 లోగో వ్యక్తి ప్రాపర్టీగా ఉండదని,కంపెనీ ప్రాపర్టీగా మాత్రమే ఉంటుందన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో ఎలాంటి కేసు పెండింగ్ లో లేదన్నారు. రవిప్రకాష్,శివాజీలకు సంబంధించిన పిటిషన్ పై నేషనల్ కంపెనీ అప్పియేట్ లా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకి తెలియజేశారు.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని వాయిదా వేసింది


Latest News
 

నేనెక్కడున్న నా మనసు కొడంగల్ ప్రజల మీదే: సీఎం Fri, Mar 29, 2024, 01:06 PM
అదుపుతప్పి తుఫాను బోల్తా పెళ్లి బృందానికి గాయాలు Fri, Mar 29, 2024, 01:04 PM
తెల్లవారుజామున చోరీకి యత్నం.. దుండగుడు పరారీ Fri, Mar 29, 2024, 01:03 PM
డా. చిన్నారెడ్డిని కలిసిన విశ్రాంత ఉపాధ్యాయులు Fri, Mar 29, 2024, 12:58 PM
నవీన్ రెడ్డి గెలుపు ఖాయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి Fri, Mar 29, 2024, 12:55 PM