ఇక‌పై ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు!

byసూర్య | Mon, Jun 17, 2019, 07:20 PM

కరెంట్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకానికి విద్యుత్ శాఖ శుభవార్త ప్రకటించింది. ప్రతినెల కరెంట్ బకాయిలు వసూలు చేయడం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారింది. ప్రతినెల కోటి 20 లక్షల రూపాయల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయంటే.. బకాయిలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం అవుతోంది. అయితే బకాయిల నుంచి ఉపశమనం పొందడానికి విద్యుత్ శాఖ అధికారులు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మీటర్లు అందుబాటులోకి రాగానే విద్యుత్ బిల్లును మొబైల్ రీచార్జ్ లాగా ముందుగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 2018 సెప్టెంబర్ నుంచి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల వాడకాన్ని ఎస్పీడీసీఎల్ సంస్థ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వేల 192 ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసి వాటి పనితీరును పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. విద్యుత్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని విద్యుత్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. వీటితోపాటు విద్యుత్ చెల్లింపు కేంద్రాల్లో కూడా విద్యుత్‌ను రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా ప్రధాన నగరాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్ శాఖ ముఖ్య అధికారులు తెలిపారు. ముందుగా హైదరాబాద్​లో ఆ తర్వాత వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాల్లో కూడా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM