వివేక్ కు పెద్దపల్లి టికెట్ ఇవ్వకపోవడం వెనుక ఉన్న కారణం ఇదేనా?

byసూర్య | Fri, Mar 22, 2019, 02:12 PM

అలా.. కేసీఆర్ హ్యాండిచ్చిన వారిలో మొదటి వ్యక్తి వివేక్. వివేక్ కు టికెట్ ఇవ్వొద్దని పెద్దపల్లి లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేలు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారట. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేదట. అయితే.. పెద్దపల్లి నియోజకవర్గంలో వివేక్ పై కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయనకు టికెట్ దక్కుతుందని అంతా భావించారు. తనకు టికెట్ కన్ఫర్మ్ అని ఆయన కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్న తరుణంలో కేసీఆర్.. వివేక్ కు సీటు కేటాయించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.


ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను కూడా సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన సోదరుడికి టికెట్ ఇవ్వకపోవడం, దీంతో వివేక్ తన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రచారం చేసి.. ప్రత్యర్థులు గెలిచేందుకు ఫండ్స్ ఇచ్చారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు వెళ్లింది. చివరి వరకు వివేక్ టికెట్ విషయంలో పునరాలోచించిన కేసీఆర్.. ఎమ్మెల్యేలు వివేక్ కు టికెట్ ఇవ్వొద్దంటూ బల్లగుద్దిమరీ చెప్పడంతో చేసేది లేక వేరే వ్యక్తికి టికెట్ ఖరారు చేశారంటూ ప్రచారం జరుగుతోంది


 


 


 


Latest News
 

కాలుష్యం అవుతున్న ఉదయ సముద్రం రిజర్వాయర్ Thu, Apr 18, 2024, 01:46 PM
రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ నేత దుర్మరణం Thu, Apr 18, 2024, 01:00 PM
విద్యార్థిని చితక బాదిన ఉపాద్యాయుడు Thu, Apr 18, 2024, 01:00 PM
నేడు బీ-ఫామ్‌ అందుకోనున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు Thu, Apr 18, 2024, 12:33 PM
నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు Thu, Apr 18, 2024, 12:12 PM