byసూర్య | Fri, Mar 22, 2019, 12:09 PM
మెదక్ : టీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను కొత్త ప్రభాకర్‌రెడ్డి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.