ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

byసూర్య | Fri, Mar 22, 2019, 08:52 AM

హైదరాబాద్ : కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌; వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల పోలింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పట్టభద్రులు, టీచర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆయా జిల్లాల్లోని కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది. అధికారులు ప్రతి వెయ్యిమంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 472 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 185 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM