వార్నర్ పై ప్రశంసల వర్షం..

byసూర్య | Thu, Mar 21, 2019, 12:45 PM

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి రావడంతో సన్‌రైజర్స్ బలం పుంజుకుందని ఆ జట్టు మెంటార్ లక్ష్మణ్ అన్నాడు. ఆటగాడిగానే కాకుండా అతని కెప్టెన్సీ నైపుణ్యాల ముందు వేరే వారెవరూ సాటిరాలేరని లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన వార్నర్ ఇటీవలే తిరిగి సన్‌రైజర్స్ జట్టులో చేరాడు.జట్టులో కొత్తగా చేరిన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని బుధవారం సన్‌రైజర్స్‌ యాజమాన్యం నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వీవీఎస్ లక్ష్మణ్  మాట్లాడుతూ "ప్రస్తుత కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌కు వార్నర్‌ తోడవ్వడంతో సన్‌రైజర్స్‌ ఇంకా పటిష్టంగా మారింది. వార్నర్ ప్రపంచస్థాయి ఆటగాడు. గతంలో సారథిగా వార్నర్‌ జట్టును నడిపించిన తీరుపట్ల ఫ్రాంచైజీ గర్విస్తోంది" అని అన్నాడు.


మ్యాచ్‌ విన్నర్‌గానే కాకుండా కెప్టెన్‌గా అతని ప్రతిభకు సాటి లేదు. ఫ్రాంచైజీ కోసం అతను చాలా సాధించిపెట్టాడు. జట్టులో యువ ఆటగాళ్ల అభివృద్ధిలో వార్నర్‌ది చాలా కీలక పాత్ర. మ్యాచ్‌కు సన్నద్ధమయ్యేందుకు అతను పడే కష్టం, నిబద్ధత అందరికీ ఉదాహరణగా నిలుస్తుంది. త్వరలో మొదలయ్యే సీజన్‌లో జట్టుకు విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు" అని లక్ష్మణ్ అన్నాడు.


 


 






Latest News
 

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన Mon, Apr 15, 2024, 10:50 PM
ఆలయంలో అఖండ భజన కార్యక్రమం Mon, Apr 15, 2024, 10:13 PM
అగ్ని ప్రమాదంలో ఆరు ఎకరాల తోట దగ్ధం Mon, Apr 15, 2024, 10:11 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్యవైశ్య బచ్చు రామకృష్ణ Mon, Apr 15, 2024, 10:10 PM
అచ్చంపేట పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే Mon, Apr 15, 2024, 10:07 PM