హోలీ వేడుకల్లో మసూద్‌ దిష్టిబొమ్మ దహనం

byసూర్య | Thu, Mar 21, 2019, 10:57 AM

ముంబయి:  ముంబయిలోని వర్లీ ప్రాంతంలో హోలికకు బదులుగా 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా అధినేత మసూద్‌ అజార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా ముంబయిలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇలా మసూద్‌ బొమ్మను, చిత్రపటాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. వందేమాతరం నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. మసూద్‌తో పాటు ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌, అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహిం దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. ‘రాక్షసులను అంతం చేయాలి. అందుకే ఈ రోజు మసూద్‌, దావూద్‌, సయీద్‌ దిష్టిబొమ్మలను మేం తగలబెట్టాం. పుల్వామా దాడి లేదా మరో ఉగ్రదాడే కావొచ్చు.. మన దేశంలో జరిగే ఉగ్ర ఘటనలకు ఈ ముగ్గురే కారణం. వారికి శిక్ష పడాలి’ అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన శివసేన నేత ఒకరు తెలిపారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM