మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్

byసూర్య | Wed, Mar 20, 2019, 12:38 PM

ఓ మహిళ పట్ల ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు జరిగిన జగుప్సాకర అనుభవాన్ని అమ్రితా అనే మహిళ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

తన భర్తతో కలసి తాను ఉబెర్ క్యాబ్ లోకి ఎక్కాను. తొలుత ఏసీ వేయడానికి ఉబెర్ డ్రైవర్ తిరస్కరించాడు. ఆ తర్వాత ఏసీ వేసినా, చల్లగా లేకపోవడంతో, ఉబ్బరంగా ఉందని చెప్పారు. దీంతో, అంత ఉక్కపోతగా ఉంటే వచ్చి నా ఒళ్లో కూర్చో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తాము గమ్యస్థానం చేరేంత వరకు తమను దించడానికే యత్నించాడు. సభ్యత లేని ఉబెర్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అంటూ అమ్రితా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను ఢిల్లీ పోలీసులు, ఉబెర్ కు ట్యాగ్ చేసింది. తాను ప్రయాణించిన కారు, డ్రైవర్ ఫొటోను కూడా జత చేసింది.ఈ ఘటనపై ఉబెర్ యాజమాన్యం స్పందించింది. జరిగిన ఘటనకు బాధపడుతున్నామని సమాధానమిచ్చింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM