తమ్ముడి రుణం తీర్చిన అన్న

byసూర్య | Tue, Mar 19, 2019, 01:30 PM

న్యూఢిల్లి : పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ కంపెనీ రిలయెన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ చెల్లించాల్సిన 80 మిలియన్‌ డాలర్ల అప్పును ఆయన సోదరుడు ముఖేష్‌ అంబానీ చెల్లించారు. ఎరిక్సన్‌ ఎబి సంస్థకు అనిల్‌ అంబానీ కంపెనీ బకాయిలు పడింది. బకాయిలు తీర్చడంలో అనిల్‌ అంబానీ విఫలమవడంతో ఎరిక్సన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఒక నెలలో బకాయిలు తీర్చాలని లేదా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని అనిల్‌ను ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. నేటితో సుప్రీంకోర్టు విధించిన గడువు తీరిపోయింది. కాగా ఈ బకాయిలను ముఖేష్‌ తీర్చివేశాడు. ముఖేష్‌ చేసిన సహాయంపట్ల అనిల్‌ స్పందిస్తూ తన సోదరుడికి, వదినకు ఎంతో రుణపడ్డామని అన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM