ఫామ్ 26 కు సంబంధించి విదేశీ ఆస్తులు చూపాల్సిందే: రజత్ కుమార్

byసూర్య | Mon, Mar 18, 2019, 10:36 PM

లోక్ సభ ఎన్నికలకు ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిందని, ఎన్న‌క‌ల‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసామని,  సీఈఓ రజత్ కుమార్ తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యయ పరిశీలకులు ఒకటి రెండు రోజులలో వస్తున్నారు. ఫామ్ 26 కు సంబంధించి విదేశీ ఆస్తులు చూపెట్టాల్సిందే. నామినేషన్ లో ప్రతి కాలం భర్తీ చేయాలి. ఏ ఒక్కటి వదిలిపెట్టినా నామినేషన్ తిరస్కరించబడుతుంది. అభ్యర్థులు అందరూ నామినేషన్ ఫామ్ ను జాగ్రత్తగా నింపాల‌ని, పది నియోజకవర్గాలలో ఖర్చులకు సంభందించి ప్రత్యేక దృష్టి పెట్టామ‌ని తెలిపారు. దివ్యాంగులకు సంబంధించి గత ఎన్నికల్లో అనేక కార్యక్రమాలు చేపట్టామ‌ని, ఈసారి కూడా అవే ఏర్పాట్లు ఉంటాయ‌న్నారు. గణనీయంగా దివ్యాంగ ఓటర్ల సంఖ్య పెరిగింద‌న్నారు. కేంద్ర బలగాలు మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి వస్తున్నాయ‌ని, కోడ్ ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM