తెలంగాణ ఎన్నికల సంఘానికి విశ్వహిందు పరిషత్ ఫిర్యాదు

byసూర్య | Mon, Mar 18, 2019, 10:31 PM

న్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ బహిరంగ సభలో హిందువులను అవమానించేలా మాట్లాడిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ను కోరింది. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ఎన్నికల సంఘానికి విశ్వహిందు పరిషత్‌(వీహెచ్‌పీ) ఫిర్యాదు చేసింది.  ఆ సభలో ‘హిందూ గాళ్లు, బొందు గాళ్లు.. దిక్కుమాలిన దరిద్రుల చేతిలో దేశం ఉంది’అంటూ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యానించారని ఆ ఫిర్యాదులో పే ర్కొంది. లిఖితపూర్వ ఫిర్యాదుతో పాటు, కేసీఆర్‌ ప్రసంగానికి సంబంధించిన సీడీని కూడా సమర్పించింది. అంతేకాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్డును కూడా కించపరిచారని, జాతీయ సమగ్రతకు భంగం కలిగేలే మాట్లాడిన కేసీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ బృందం రజత్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేసింది. 
వీహెచ్‌పీ ఇచ్చిన ఫిర్యాదుపై రజత్‌ కుమార్‌ స్పందించారు. కరీంనగర్‌ జిల్లా ఎన్నికల అధికారులను నివేదిక కోరుతూ ఆదేశాలు జారీ చేశారు. నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వీహెచ్‌పీ బృందానికి హామీ ఇచ్చారు. 


Latest News
 

అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించండి Wed, Apr 24, 2024, 12:26 PM
కాంగ్రెస్ లో చేరనున్న 25 మంది మాజీ సర్పంచ్లు Wed, Apr 24, 2024, 12:22 PM
డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ Wed, Apr 24, 2024, 12:21 PM
పూజలు నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రఘువీర్ Wed, Apr 24, 2024, 11:42 AM
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి స్పందించిన కేసీఆర్ Wed, Apr 24, 2024, 11:40 AM