చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్‌

byసూర్య | Mon, Mar 18, 2019, 08:14 PM

సోమవారం నాడు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లో చేరారు.  ఈ సందర్భంగా హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన  ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఏప్రిల్ 11వ తేదీ తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఏమిటో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. 
మహారాష్ట్ర ఎన్నికలపై ఏ రకమైన ఆసక్తితో ప్రజలు ఉన్నారో, ఏపీలో కూడ ఎన్నికలపై ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబును ఇంటికి పంపించేందుకు ఏపీ ప్రజలు సిద్దంగా ఉన్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మంత్రులంటే బానిసలు కాదని, చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వద్ద మంత్రిగా పనిచేయలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తన వద్ద కేసీఆర్ పనిచేశాడని చంద్రబాబునాయుడు చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమని, టీడీపీని చంద్రబాబునాయుడు స్థాపించిన ట్టుగా  మాట్లాడడం సరైందికాదన్నారు. చంద్రబాబునాయుడు అవకాశవాది అని, టీఆర్ఎస్‌ జాతీయ పార్టీ పెడితే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు.   


Latest News
 

సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM
అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు Thu, Mar 28, 2024, 01:38 PM
గాయత్రి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ Thu, Mar 28, 2024, 01:37 PM