కర్షకుల కన్నెర్ర‌ : ఎంపీ క‌విత‌పై ఎన్నిక‌ల్లో పోటీ

byసూర్య | Mon, Mar 18, 2019, 07:47 PM

కేసీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగిడిన కవిత ఎంపీగా గెలిచి సత్తా చాటుకుంది. ఈసారి కూడా లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి ఆమె పొటీకి దిగనుంది. కానీ ఆమెకు పొటీగా 1000 మంది బరిలోకి దిగనున్నారు. అయితే వారు రాజకీయ పార్టీలకు చెందినవారు కాదు. అందరూ రైతులే. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాలను స్వీప్ చేస్తామని ఘంటాపధంగా చెబుతున్న అధికార తెరాస పార్టీ కి కలవరం పెడుతున్న విషయం ఇది. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపీ కవితపై పోటీ చేసేందుకు వేయి మంది రైతులు సిద్దం కావడం ఆ పార్టీని ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. గెలుపు విషయంలో ఆమెకు ఢోకా లేనప్పటికీ ఆమెకు షాకిచ్చేలా నిజామాబాద్ రైతులు కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక్కో గ్రామం నుంచి ఐదు మంది చొప్పున నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ సీటులో పోటీచేయలేక ఆమె ప్రత్యర్ధులు హడలి పోతున్న సమయంలో రైతులు ఇలా పెద్ద సంఖ్యలో పోటికి దిగుతామని షాక్ ఇచ్చారు. దీనంతటికి కారణం నిజామాబాద్ రైతులు పసుపు - ఎర్రజొన్న మద్దతు ధర కోసం కొన్నాళ్ళుగా ఆందోళన చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా కవిత పట్టించుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్న రైతులు అది, సోమవారం కమ్మరపల్లి లో సమావేశమయ్యారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కల్వకుంట్ల కవితపై పోటీకి నామినేషన్లు వేయాలని నిర్ణయించారు ఇదే జరిగితే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ వాడాల్సి ఉంటుంది. దాని ఫలితం ఎన్నిక వాయిదా పడే అవకాశాలు లేక పోలేదు. నామినేషన్ ఫీజును చందాల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. వీరంతా అనుకున్నట్టే పోటీలో నిలిస్తే ఓట్లు చీలడం తథ్యం. అసలే మెజారిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు కేసీఆర్. ఎంత ఎక్కువ మెజారిటీ వస్తే అంత బలం అని ఆయన అభిప్రాయం. మరి ఆ మెజారిటీకి గండి కొట్టేలా రైతులు తీసుకున్న ఈ డెసిషన్ పట్ల కవిత కానీ కేసీఆర్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM