ఆన్‌లైన్‌ మోసాల నివారణే మా లక్ష్యం: డీజీపీ

byసూర్య | Mon, Mar 18, 2019, 04:36 PM

హైదరాబాద్‌:  ఆన్‌లైన్‌ మోసాల బారిన పడకుండా చూడడమే మా లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సైబర్‌ రక్షక్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత సెల్‌ఫోన్లకు బానిస కాకుండా కూడా చూడాలనేది మా ఆశయమన్నారు. మహిళల ఫిర్యాదులు పరిష్కరించడంలో హైదరాబాద్‌ పోలీసులు ముందున్నారన్నారు. షీటీమ్‌, భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలతో కూడా కలిసి మహిళల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఉద్యోగాలకు, సంతోషకరమైన జీవనానికి హైదరాబాద్‌ పేరొందిందని, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, మహిళలకు రక్షణ అంశాల్లో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి ర్యాంక్‌ దక్కిందన్నారు.


Latest News
 

సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM
అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు Thu, Mar 28, 2024, 01:38 PM
గాయత్రి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ Thu, Mar 28, 2024, 01:37 PM