అండగా నిలుస్తామ‌ని చెప్పిన వాళ్లే తెరాస గూటికి చేరుతున్నారు : రేవంత్

byసూర్య | Sat, Mar 16, 2019, 02:51 PM

మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలంగౌడ్‌ను కలసిన రేవంత్ .అనంతరం మీడియా తో మాట్లాడుతూ ...తెరాస చేస్తున్న అరాచకాల మీద పోరాటం చేస్తునందుకు నా పై కేసులు .రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్ రక్షసత్వాన్ని చూపిస్తున్నారని విమర్శించారు రేవంత్.. ఇప్పటి ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయన్న ఆయన... నేను ఇంట్లో ఉంటే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వచ్చి నన్ను పోటీ చేయమని అడిగారు, నేను సబితమ్మ ఇంటికి వెళ్లి అడిగిన నన్ను పోటీ చేయమని అడుగుతున్నారు, మిరే బాధ్యత తీసుకోవాలంటే.. రేవంత్ పోటీ చేయి.. నేను చూసుకుంటా అని సబితక్క అన్నారు.


కానీ, ఇప్పుడు నా బంధువులు అందరూ కేసీఆర్ పక్కన చేరారని, బంధువులు అందరూ ఒక పక్కన ఉంటే నేను పోటీ చేయడం అవసరమా అనుకున్నా.. కానీ, కేసీఆర్ లాంటి రాక్షసుని ఎదుర్కోవడానికి తప్పదు అనిపించిందన్నారు రేవంత్. ఎన్నికల్లో విచక్షణతో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని సూచించిన ఆయన.. మీ ప్రాంతం నుంచి ఎలాంటి వ్యక్తి ఉండాలో ప్రజలు ఆలోచించాలి, చట్ట సభల్లో మీ సస్యలు లెవనెత్తె వాళ్లకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 2014లో కూడా 15 మంది ఎంపీలు ఉంటే కేసీఆర్ ఏం సాధించారని ప్రశ్నించారు రేవంత్... కనీసం కంటోన్మెంట్‌లో రోడ్డు కూడా సాధించలేదని ఆరోపించిన ఆయన.. ఇప్పుడు 16 మందిని గెలిపిస్తే ఏంచేస్తారు? అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటు వేస్తే మోడీ, కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాహుల్.. మరి టీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎవరు ప్రధాని? అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ అని.. 25 రోజులు నిరంతరంగా కాంగ్రెస్ కోసం పనిచేయాలని.. కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని ధైర్యాన్ని చెప్పారు రేవంత్. 


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM