4 లక్షల కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన 86 సంవత్సరాల తాత

byసూర్య | Sat, Mar 16, 2019, 01:06 PM

ఈ రోజుల్లో వయస్సులో ఉన్నవారే ఒక అరగంట సైకిల్ తొక్కితే అలిసిపోతారు. కానీ, కర్ణాటక రాజధాని బెంగళూరులో 86 ఏళ్ల వయస్సు ఉన్న తాత ఏకంగా 4 లక్షల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి ఔరా అనిపించారు. 86 సంవత్సరాల వయస్సులో కూడా అతను 20 ఏళ్ల వయస్సు గల శక్తిని కలిగి ఉంటాడు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, ఆయన గురించి మీరు పూర్తిగా తెలుసుకోవల్సిందే.  


ఈయన పేరు బెలహల్లి రఘునాథ్ జనార్థన్. వయస్సు 86 ఏళ్లు. ఆయనకు సైక్లింగ్ అంటే ప్రాణం. ఆయన కేవలం సైక్లింగ్ మాత్రమే కాదు.. 20 సార్లు హిమాలయాలను కూడా చుట్టేశారు. అది కూడా కాలినడకన. అయితే, ఆయనకు మూర్ఛ వ్యాధి ఉంది. ఆ వ్యాధే అతనిలో దాగిన కొత్త వ్యక్తిని బయటకు తీసుకొచ్చింది.


58 ఏళ్ల వయస్సులో మూర్ఛ వ్యాధిబారిన పడిన జనార్థన్.. కొంతకాలం మందుల మీదే బ్రతికాడు తరువాత, అతను దానిని భరించలేకపోయాడు. ప్రతీరోజు ధ్యానం చేసేవాడు.. ధ్యానంతో దాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నించారు. కానీ, అది కుదరలేదు. ఓ రోజు అర్ధరాత్రి నిద్ర పట్టక ఆయన నడక ప్రారంభించి చాలా దూరం ప్రయాణించాడు. అప్పటి నుంచి అతనికి మూర్ఛ రాలేదు. దీంతో రోజు నడవటం అలవాటు చేసుకున్నారు. అయన అందరిలాగా పొద్దునే టీ, కాఫీ తాగడు ఆరోగ్యంగా ఉండటం కోసం రోజు పొద్దున గ్లాస్ మంచినీళ్ళు, భోజనానికి మొలకెత్తిన కూరగాయలు మాత్రమే తినడానికి ఇష్టపడతారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను 64 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు సైక్లింగ్ మొదలుపెట్టాను. అప్పటి నుంచి సుమారు 265 నెలలు సైకిల్ తొక్కుతూనే ఉన్నాను. అలా 4 లక్షల కిలోమీటర్లు పైగా సైక్లింగ్ చేశాను. నాలో ఆత్మ విశ్వాసం పెరిగిన తర్వాత 68 ఏళ్ల వయస్సులో ట్రెక్కింగ్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పటివరకు 20 సార్లు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేశాను. మౌంట్ కైలాశ్‌‌‌ను కూడా చుట్టి వచ్చాను’’ అని తెలిపారు.


Latest News
 

సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత Fri, Mar 29, 2024, 08:37 PM
మానవాళి కోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగం Fri, Mar 29, 2024, 08:36 PM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు Fri, Mar 29, 2024, 08:34 PM
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత Fri, Mar 29, 2024, 08:33 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:32 PM