ప్రాంతీయ పార్టీలే కీలకం -ఎంపీ కవిత

byసూర్య | Fri, Mar 15, 2019, 08:35 PM

ఎన్నికలు దగ్గర పడడంతో అందరూ తమతమ పనుల్లో మునిగిపోయారు. నిజామాబాద్ లో ఎంపీ కవిత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడే అవకాశం ఉంది. కనుక ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలు 19న సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ సభకు అందరూ తరలిరావాలని ప్రజలను కోరారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఉండాలని..జాతీయ పార్టీలు రాష్ట్రాల సమస్యలు పట్టించుకోవటం లేదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఉంటే రాష్ట్రీయ, జాతీయ సమస్యలపైనా పోరాడవచ్చని..రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు ఐఎఎస్ లేరని..కేంద్రాన్ని అడిగినా పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. దేశంలో జరుగుతున్న అనేక సమస్యలపైన కేంద్రం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. టీఆరెస్ పార్టీ అభ్యర్థులను 16, ఒక ఎంఐఎంను మనం గెలిపించుకోవాలని ఆమె తెలిపారు. అలా చేస్తే మనం 17 మంది పార్లమెంట్ లో ఉంటాం అని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చే అవకాశం ఉండటంతో టీఆరెస్ కీలక పాత్ర పోషిస్తుందని..అందుకే మనం టీఆరెస్ కు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తెలంగాణలో నడుస్తున్న అనేక కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు.
లోక్‌సభలో ముందుండి కొట్లాడి మన హక్కులను సాధించుకుంటాం. కాంగ్రెస్, బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మనం కీలకం అవుతామని కవిత చెప్పారు. తెలంగాణ హక్కులను సాధించుకోవడమే కాకుండా.. దేశ రాజకీయాల్లో మార్పు కూడా తీసుకురావడానికి ఆస్కారం ఉందన్నారు. తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారు. మన నాయకుడి వద్ద ఒక విజన్, దూరదృష్టి, దార్శనికత ఉందన్నారు. మంచి నాయకుడు, గొప్ప ఆలోచన ఉంటే.. దేశానికే దిశానిర్దేశం చేయొచ్చు అని ఎంపీ కవిత పేర్కొన్నారు.


Latest News
 

సివిల్స్ ర్యాంకర్ కు స్టడీ సర్కిల్ డైరెక్టర్ అభినందనలు Sat, Apr 20, 2024, 11:52 AM
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్ Sat, Apr 20, 2024, 11:51 AM
150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM