రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్‌ చుస్తునారు : వీహెచ్

byసూర్య | Fri, Mar 15, 2019, 03:48 PM

వైసీపీ అధినేత జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి మృతికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సంతాపం తెలిపారు. వివేకా మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. వివేకా మృతిపై తనకు చాలా అనుమానాలు ఉన్నాయనన్ారు.శుక్రవారం వీహెచ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ కి చెందిన యాగా కంపెనీకి ఇచ్చిన భూమిని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో సీబీఐ ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.రేవంత్ రెడ్డికి అయితే ఒక నీతి.. జగన్ కి అయితే మరో నీతా అని మండిపడ్డారు.రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని, నరేంద్రమోదీకి.. జగన్‌ అవినీతిపరుడిగా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులు వ్యభిచారం కంటే హీనమని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. 


 


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM