కంటోన్మెంట్‌లో ఆంక్షలు ఎత్తివేత

byసూర్య | Fri, Mar 15, 2019, 09:22 AM

దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ నెల 1వ తేదీ నుంచి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని మిలటరీ స్థావరాలల్లో విధించిన ఆంక్షలను ఎత్తివేశారు. ఈ మేరకు గురువారం సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వాటర్స్‌ ఆదేశాల మేరకు బోర్డు పరిధిలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు రక్షణశాఖ పౌర సంబంధాల శాఖ అధికారి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్‌గా పేరుగాంచిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌(ఏఓసీ) రహదారుల్లో రాత్రివేళల్లో వాహనాల రాకపోకలను నిషేధించిన విషయం తెలిసిందే. 


రాత్రి 10 గం టల నుంచి ఉదయం 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండేది. దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో కంటోన్మెంట్‌ ప్రాంతంలో సైనిక స్థావరాలు, శిక్షణ శిబిరాలు ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా ఆంక్షలు విధించారు. అయితే సికింద్రాబాద్‌ ప్రాంతంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్‌తో వాహనదారులు నానాటికీ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వాటర్స్‌ ఆదేశాల మేరకు ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆంక్షలు ఎత్తివేయడంతో ఈస్ట్‌ మారేడ్‌పల్లి చౌరస్తాతో పాటు షెనాయ్‌ నిర్సంగ్‌ హోమ్‌ చౌరస్తా, సికింద్రాబాద్‌ కల్బ్‌, పికెట్‌ చౌరస్తా, తిరుమలగిరి చౌరస్తా, కేవీ జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో నెలకొల్పిన సూచిక బోర్డులను అధికారులు తొలగించారు. స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM