శిఖా చౌదరికి సంబంధంలేదు: డీసీపీ

byసూర్య | Thu, Mar 14, 2019, 06:02 PM

హైదరాబాద్‌: వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. సినీ సహాయ నటుడు సూర్య ప్రసాద్‌, కిశోర్‌తో పాటు స్థిరాస్తి  వ్యాపారి అంజిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు 90శాతం పూర్తయిందని పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. శిఖా చౌదరికి జయరాం హత్య కేసుతో సంబంధం లేదని డీసీపీ స్పష్టంచేశారు. జయరాంను బెదిరించి డబ్బు వసూలు చేయాలనే రాకేశ్‌ రెడ్డి కుట్ర పన్నాడని తెలిపారు. సూర్య ప్రసాద్‌, కిశోర్‌ జయరాంను రాకేశ్‌ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని, హత్య అనంతరం అంజిరెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారి రాకేశ్‌ రెడ్డి ఇంటికి వెళ్లినట్టు డీసీపీ వివరించారు. రాకేశ్‌ రెడ్డి హత్య చేసిన విషయం తెలిసినా అంజిరెడ్డి చెప్పలేదన్నారు. జయరాంను బెదిరించి రాయించుకున్న పత్రాలు అంజిరెడ్డి వద్ద దాచాడన్న డీసీపీ.. హత్యతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలేది లేదని స్పష్టంచేశారు. పోలీసుల ప్రమేయంపైనా ఆధారాలు సేకరిస్తున్నామని, రాకేశ్‌ రెడ్డి ప్రగతి రిసార్ట్స్‌ యజమానులను బెదిరించాడని తెలిపారు. రాకేశ్‌ రెడ్డికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్న మాట వాస్తవమేనని.. ఈ హత్య కేసులో నేతల ప్రమేయం ఉన్నట్టు ఆధారాల్లేవని చెప్పారు. 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM