అటవీ సంపద రక్షణ కోసం ప్రత్యేక సాయుధదళం

byసూర్య | Tue, Jan 22, 2019, 10:35 PM

తెలంగాణ రాష్ట్రంలో పులుల రక్షణ కోసం ప్రత్యేకంగా స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో ఉన్న పులులు, వన్యప్రాణులకు రక్షణ కల్పించేందుకు 112 మంది సిబ్బందితో ఈ ప్రత్యేక సాయుధ దళం ఏర్పాటు కానుంది. రెండు చోట్లా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నేతృత్వంలో ముగ్గురు రేంజ్ ఆఫీసర్లు, 81 మంది గార్డులు, 26 మంది ఫారెస్ట్ వాచర్లతో ఈ సాయుధదళం పనిచేస్తుంది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ రక్షణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సాయుధదళం నిర్వహణకు అయ్యేఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం చొప్పున భరిస్తాయి. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ తగిన చర్యల కోసం రెండు కోట్లా ఇరవై ఐదు లక్షల రూపాయల నిధుల విడుదలకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది.ఇక ముఖ్యమంత్రి సూచన మేరకు సంబంధిత శాఖల సమన్వయంతో అడవుల రక్షణ కోసం సమీకృత ప్రణాళికను సిద్దం చేసి, అమలు చేయాలని నిర్ణయించారు. అడవుల్లో చెట్ల నరికివేతను నియంత్రించటం, వేటను పూర్తిగా అరికట్టడం, అటవీ నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉండటంతో పాటు, పీడీ చట్టం కింద కేసులు పెట్టేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జంతువుల వేట కోసం విద్యుత్ ను వాడితే, కరెంట్ చౌర్యం, అక్రమ వినియోగం కింద కేసులు పెట్టాలని, అటవీ ప్రాంతాల్లో పనిచేసే విద్యుత్ ఉద్యోగులు కూడా సంబంధిత విషయాలపై నిరంతరం నిఘా పెట్టాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. అటవీ నేరాల్లో విచారణ వేగంగా చేయటం, నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా పనిచేసేందుకు అటవీ శాఖకు న్యాయ సహకారం అందించాలని నిర్ణయించారు. జిల్లాకు ఒక లీగల్ అడ్వయిజర్ ను నియమించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. టాస్క్ ఫోర్స్ దాడులు, అటవీ భూముల ఆక్రమణల తొలగింపునకు అవసరమైన చోట పోలీసుల సహకారానికి నిర్ణయించారు. అటవీ శాఖ కోరిన చోట పోలీసులతో ఔట్ పోస్టును కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. అటవీ సమీప గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి అటవీ రక్షక దళాలను ఏర్పాటు చేయాలని, కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు దీనిపై అవగాహన కల్పించాలని అధికారులకు సీ.ఎస్ సూచించారు.


 


 


 


Latest News
 

చిన్న క్యారీ బ్యాగ్ ఎంత పని చేసింది.. అంత పెద్ద 'ఐకియా'నే ఫైన్ కట్టించింది. Sat, Apr 20, 2024, 07:23 PM
తీన్మార్ మల్లన్న గిదేందన్నా.. గరీబోళ్లు కదన్న.. బక్కా జడ్సన్ రిక్వెస్ట్ Sat, Apr 20, 2024, 07:20 PM
గరుడ ప్రసాదం ఎఫెక్ట్.. చిలుకూరు ఆలయంలో 'వివాహ ప్రాప్తి' కార్యక్రమం రద్దు Sat, Apr 20, 2024, 07:16 PM
రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM