ఈవీఎంల టాంపరింగ్ నమ్మొద్దు: సీఈఓ రజత్

byసూర్య | Tue, Jan 22, 2019, 09:22 PM

ఈవీఎం ల పై వచ్చే ఆరోపణలు నమ్మొద్దని తెలంగాణ సీఈఓ రజత్ కుమార్ అన్నారు. మొన్న మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా కొన్ని పార్టీ ల నేతలు ఇలానే మాట్లాడారు కానీ నిరూపించలేకపోయారు. నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఓటర్ల అవగాహన కేంద్రాన్ని ప్రారంభించిన తరువాత సీఈఓ రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈవీఎం లపై ఆరోపణలు చేసినారు ఎందుకు కోర్టు లో సవాల్ చేయడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎం లపై 38 సార్లు కోర్టుల కు వెళ్లారు కానీ నిరూపించలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ ను అపహాస్యం చేయొద్దు. ట్యాంపరింగ్ అనేది ఆధారం లేని ఆరోపణ, ప్రజాస్వామ్యం పై ప్రజల కి ఉన్న విశ్వాసం దెబ్బతీయవద్దు. తాను ఈ సీ ఐ ఎల్ లో పని చేసాను అని చెప్పుకున్న వ్యక్తి చేసే ఆరోపణలు పట్టించు కోవద్దన్నారు. తను నిజంగా పని చేసి ఉంటే ఇక్కడే ఎందుకు చెప్పలేదు. అయినా దీని పై ఈసీఐఎల్ సంస్థ అండ్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పందించాయన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి మాటలను ప్రోత్సహించవద్దు. 1980 నుండి ఈవీఎం లు అందుబాటులో కి వచ్చాయి. ఇప్పటి వరకు చాలా మంది వీటిపై కేసులు వేశారు. కానీ ఎక్కడ ఒక్క కేసు కూడా నిలవలేదు. ఈవీఎం ల పై సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. విమానంలో ఎదో టాంపరింగ్ అయింది అని విదేశాలకు వెళ్లేవారు ఎడ్ల బండిలో వెళ్ళరు కదా ప్రశ్నించారు. టాంపరింగ్ అనుమానాలు, ఆరోపణలు రావడంతో వీవీ ఫ్యాట్ విధానం అమలు లోకి తెచ్చారు. అయినా కొన్ని పార్టీ లు తిరిగి బ్యాలెట్ పేపర్ కావాలి అంటున్నాయి. అలా డిమాండ్ చేస్తే సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడమే. ఇటువంటి డిమాండ్ల వలన దేశం తిరోగమన దిశలోకి వెళ్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈవీఎం లని వినియోగించడం జరుగుతుంది. దీని పై మరింత అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నాము..


 


 


 


 


 


 


Latest News
 

సీఎం రేవంత్ గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు Fri, Mar 29, 2024, 12:31 PM
కీటక జనిత వ్యాధులపై అవగాహన పెంచాలి Fri, Mar 29, 2024, 12:07 PM
సీఎం రేవంత్ తో ముగిసిన కేకే భేటీ Fri, Mar 29, 2024, 12:07 PM
కోయిల్ సాగర్ పంటలకు నీటి విడుదల Fri, Mar 29, 2024, 12:06 PM
న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా Fri, Mar 29, 2024, 12:04 PM